స్థానిక తోటపాలెంలో గల సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తేదీ 28 - 2 - 2023 న జాతీయ సైన్స్ డే ను జరిపారు. మొట్టమొదటిగా భారతీయ భౌతిక శాస్త్రవేత్త అయిన సర్ సి వి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు జ్ఞాపకార్ధంగా ప్రతి సంవత్సరం సైన్స్ డే ను సైన్స్ విలువలను గౌరవించడానికి మరియు మానవజాతి జీవన విధానంపై అది చూపిన ప్రభావాన్ని గుర్తుచేసుకునేందుకు ఇది జరుపుకుంటారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వం మొదలైన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశిభూషణ్ రావు గారు మాట్లాడుతూ ఈ సంవత్సరము జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యము విశ్వ శ్రేయస్సు కొరకు ప్రపంచ విజ్ఞాన శాస్త్రము అని, విద్యార్థులు శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకొని మారుతున్న టెక్నాలజీ కనుగుణంగా వారి పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని, సాంకేతిక రంగాలలో సాధించే అభివృద్ధి ప్రపంచ శ్రేయస్సు కొరకు ఉపయోగపడాలని అన్నారు. ఇలా ఉన్నప్పుడే మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలరని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వి. సాయి దేవ మణి కళాశాల ఎన్సిసి ఆఫీసర్లు కెప్టెన్ ఎం సత్యవేణి మరియు శ్రీ ఎం ఉదయ్ కిరణ్, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీ బి సూరపు నాయుడు సైన్స్ అధ్యాపకులు మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందము, విద్యార్థులు పాల్గొన్నారు.


